*తెలంగాణ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న బల్దియా కమిషనర్*
Turn off for: Telugu
*తెలంగాణ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న బల్దియా కమిషనర్*
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యంత ప్రతిష్టాత్మక తెలంగాణ ఎక్సలెన్సీ పురస్కారాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డికి నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావులు అందజేశారు. ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డిలో నేడు ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులు పలువురు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారులకు అందజేశారు. చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి, ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి డైరెక్టర్ జనరల్ బి.పి.ఆచార్య, స్పెషల్ సీఎస్ సురేష్ చంద్రలతో పాటు పలువురు రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారులు, ప్రస్తుత సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డికి అవార్డు ప్రధానం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అత్యంత సంక్లిష్టమైన భూసేకరణను చేపట్టినందుకుగాను గుర్తింపుగా ఈ తెలంగాణ ఎక్సలెన్సీ అవార్డును ప్రధానం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డితో పాటు అడిషనల్ కమిషనర్‌లు భారతిహోలికేరి, రమేష్, భాస్కరాచారిలు కూడా ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Post a Comment