జర్నలిస్ట్ ల సంక్షేమమే ధ్యేయం -టీయూడబ్ల్యూజే
జర్నలిస్ట్ ల సంక్షేమమే ధ్యేయం -టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధుల సభకు అనూహ్య స్పందన..
రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలి వచ్చిన జర్నలిస్టులు..
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం ఈ రోజు హైదరాబాద్ ఆర్ టి సి కలభవ న్ లో జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 4వేల మంది ప్రతినిధులు హాజరైన సభలో రాష్ట్రంలోని జర్నలిస్ట్ ల స్థితిగతులపై, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిగింది. దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ నిధి ని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లను ఆదుకోవడం తో పాటు డెస్క్ జర్నలిస్ట్ లకు మండల స్థాయి రిపోర్టర్ ల అందరికి అక్రిడిటేషన్ లు అందజేసిన ప్రభుత్వానికి మీడియా అకాడమీ కి ప్రతినిధుల సభ కృతజ్ఞతలు తెలిపింది. పై సమస్యలను సానుకూలంగా పరిష్కరించినట్టే చిన్న పత్రికల సమస్యలను పరిష్కరించాలని, ఇళ్లా స్థలాల కేటాయింపు పై ప్రభుత్వం సానుకూలంగ ఉన్నప్పటికి కొందరి దుష్ప్రచారం వల్ల తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సత్వర పరిష్కారానికి కానీ గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టు లకు 120 గజాల స్థలం లేదంటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లో వారికి 150 గజాల స్థలం లేదంటే అపార్టుమెంట్లు కట్టించా ఇవ్వాలని ఇక హైదరాబాద్ లోని వారికి 270 గజాల స్థలం లేదంటే 3 బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని ప్రతినిధుల సభ ప్రతిపాదించింది. అలాగే కనీస వేతలనాల అమలు జరగకపోగా జర్నలిస్ట్ ల నుంచే డబ్బులు వసూలు చేస్తూ పేపర్ లు ఛానెల్ లు నడుపుతున్న వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, యాజమాన్యాలు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని కూడా సభ ప్రతిపాదించింది.
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపంలో జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభలో అల్లం మాట్లాడుతూ..
జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉంటుందన్నారు. ప్రభుత్వం మీడియా అకాడమీ చేస్తున్న కార్యక్రమలు జర్నలిస్ట్ ల జీవితాల్లో మార్పు కనిపిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూపొందించిన పథకాలలో భాగస్వాములై వుండి, అన్నింటిని వాడుకుంటూనే అసలేం చేయలేరు అని ఒక సంఘం చెందుతున్న విమర్శ రాజకీయ విమర్శలాగే అనిపిస్తుంది అని ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్లం నారాయణ సూచించారు. టి యు డబ్ల్యూ జె పటిష్టంగా ఉంటేనే జర్నలిస్ట్ ల సంక్షేమం బాహుంతుందనే విషయాన్ని నాయకత్వం గుర్తించి దానికి అనుగూనంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ..
నిన్నా, మొన్నటి వరకు జర్నలిస్టు సంఘాన్ని చూపించి ఫైరవీలు చేసుకున్న పోటీసంఘం నాయకులు మతి భ్రమించి మాట్లాఫుతున్నార ని ఇది సరికాదని హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే ఏర్పడిందే జర్నలిస్టులకు అండగా నిలవడానికని ఆయనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల నుండి 4 వేలకు పైగా జర్నలిస్టులు ప్రతినిధుల సభలో పాల్గొన్నారు. తెలంగాణా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని మాజీ అధ్యక్షుడు టీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ ఎం. వి. రమణ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షునిగా సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శిగా ఏ.రమణ,డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఎం.యుగంధర్, ట్రెజరర్ గా పాండు రంగారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి రాష్ట్రకమిటీలు, జిల్లా కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తామని TUWJ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ MV. రమణ స్పష్టం చేసారు. అనంతరం TUWJ పలు తీర్మానాలను ప్రవేశపెట్టింది. మహిళా జర్నలిస్టుల భద్రతా, చిన్న పత్రికల పరిరక్షణ, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన ప్రధాన లక్ష్యంగా తీర్మానాలు చేసారు. అలాగే 60 ఏళ్ళు నిండిన జర్నలిస్టులకు పెన్షన్ కల్పించాలంటూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్దత కల్పించాలంటూ TEMJU రాష్ట్ర అధ్యక్షుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు తీర్మానాలను బలపరిచారు.
Comments
Post a Comment