*కృష్ణానది పునరుజ్జీవనం పైనే నగర భవిష్యత్ - మేయర్ రామ్మోహన్*
*కృష్ణానది పునరుజ్జీవనం పైనే నగర భవిష్యత్ - మేయర్ రామ్మోహన్*
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కృష్ణానది పునరుజ్జీవన అత్యంత ఆవశ్యమని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జలవనరుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో కృష్ణానది పునరుజ్జీవనం అనే అంశంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో జరిగిన సదస్సులో మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ సహా తెలంగాణలోని సగభాగం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉందని, ఇందుకుగాను రాష్ట్ర అవసరాల నిమిత్తం కృష్ణానది పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టాలని అన్నారు. తెలంగాణ జీవన ప్రమాణాల పెంపు, హైదరాబాద్ నగరం ఆర్థికంగా, పారిశ్రామిక అభివృద్ది కృష్ణానది పైనే ఆదారపడి ఉందని, ఈ నేపథ్యంలో కృష్ణానదికి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా దూరం నుండి గోదావరి జలాలను నగర అవసరాలకు తరలిస్తున్నామని, దీనికి కారణం పక్కనే ఉన్న కృష్ణానదిలో నీటి లభ్యత క్షీణించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, జీవన విధానంలో భాగమైన కృష్ణానది పునరుజ్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వంతో సహా స్వచ్ఛంద సంస్థలు, పరిశోదక సంఘాలు ముందుకు రావాలని మేయర్ రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment