*పేద ముస్లింలకు రంజాన్ గిఫ్టు ప్యాక్‌ల పంపిణీ*
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిరుపేద ముస్లింలకు నూతన వస్త్రాలతో కూడిన గిఫ్టు ప్యాకెట్లను బోరబండ డివిజన్‌లోని భరత్‌నగర్, సైట్-3 వీకర్ సెక్షన్ కాలనీలో డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ నేడు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సలహదారు ఎ.కె.ఖాన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌లు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. భరత్‌నగర్‌లోని హీర మజీద్‌లో, సైట్-3లోని అమీనా మజీద్‌లలో ఈ గిఫ్టు ప్యాక్‌ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటి మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరమే కాకుండా రాష్ట్రంలోనే ముందుగా పేద ముస్లింలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం బోరబండ డివిజన్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పేద ముస్లీంలకు గిఫ్టు ప్యాక్‌లను పంపిణీ చేయడానికి సంబంధిత మజీద్ కమిటీలకు అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు ఎ.కె.ఖాన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు దుస్తుల పంపిణీతో పాటు విందుభోజనం ఏర్పాటుకు హైదరాబాద్ నగరంలో 400లకు పైగా మజీద్‌లకు లక్ష రూపాయల చొప్పున నగదు పంపిణీ కూడా చేపడుతున్నామని తెలిపారు. రంజాన్ మాసంలో ఏవిధమైన ఇబ్బందులులేకుండా ఉండేందుకుగాను శానిటేషన్, లైటింగ్ ఇతర మౌలిక సదుపాయల కల్పనలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీని కోరామని తెలిపారు. జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లకు ఒకొక్కరికి రెండు మజీద్‌లకు లక్ష రూపాయల చొప్పున 500 గిఫ్ట్ ప్యాక్‌లను అందించామని తెలిపారు. ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అసలైన లౌకికవాద ప్రభుత్వంగా మారిందని అన్నారు.
Comments
Post a Comment