కార్మికురాలి యోగాక్షేమాలు అడిగిన బల్దియా కమిషనర్
Turn off for: Telugu
*అండాలమ్మా.....బాగున్నావా...! !*
*కార్మికురాలి యోగాక్షేమాలు అడిగిన బల్దియా కమిషనర్*
నగరంలోని సచివాలయం సమీపంలోని అనుమోల్ హోటల్ వద్ద పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికురాలి వద్ద ఒక్కసారిగా ఇన్నోవా వాహనం ఆగింది. దానిలో నుండి దిగిన ఇద్దరు అధికారులు కార్మికురాలి పేరు, వివరాలు, ఆమెకు ప్రతినెలా వేతనం సకాలంలో అందుతుందా, జీవిత బీమా సౌకర్యం, ఆరోగ్య పరీక్షల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో తన పేరు అండాలమ్మ అని తనకు ప్రతినెల వేతనం సక్రమంగానే అందుతుందని, ప్రతిరోజు తాను బయోమెట్రిక్ హాజరు ఇస్తున్నానని, తమకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆమె వారికి తెలిపారు. ఇంతకు తాము ఎవరమో తెలుసా అని అడగగా తెలియదని అండాలమ్మ సమాదానం ఇచ్చింది. తాను జీహెచ్ఎంసీ కమిషనర్ అని తనతో పాటు శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ శృతిఓజా అని డా.బి.జనార్థన్‌రెడ్డి అండాలమ్మకు తెలియజేశారు. దీనితో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన అండాలమ్మ తనతో కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయిలో ఉన్నతాధికారులు మాట్లాడటం ఇదే మొట్టమొదటి సారిఅని తన యోగాక్షేమాలు, పని విధానాన్ని కమిషనర్ అడిగి తెలుసుకోవడం పట్ల అండాలమ్మ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Comments
Post a Comment