Posts

Showing posts from June, 2018

Natural Star Nani’s voiceover for Ee Maaya Peremito

Natural Star Nani’s voiceover for Ee Maaya Peremito

యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా

Image
         యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా  సికింద్రాబాద్ మండలం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా నిర్వహించ బడుచున్నది ఇందులో 10 వ తరగతి పాస్/ఫెయిల్ , ఐ,టీ.ఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, (బీఎస్సీ, ఎమ్మెస్సీ, లైఫ్సైన్సెస్, ఫార్మసీ) యం.బీ.ఏ, బి.టెక్, ఎం.సి.ఏ, డిప్లొమా అర్హత కలిగిన 18-35 సంIIల వయస్సు గల వారు హాజరు కాగలరు, ఈ జాబ్ మేళా తేది.27.06.2018  రోజున  సికింద్రాబాద్  జోన్ పరిధి లోని హరి హారా కలా భవన్ లొ ఉదయం 9.00 AM నుండి 5.00 PM వరకు నిర్వహించబడును.  అభ్యర్ధులకు అవగాహన మరియు అభ్యర్ధి రిజిస్ట్రేషన్ మరియు అర్గనైజర్స్ పరిచయాలు ఉంటాయి,  రిజిస్ట్రేషన్ ఐన అభ్యర్దులకి H.R. లతో ఇంటర్వ్యూ జరిపి అభ్యర్ధికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబడును.  ఇందులో దాదాపు ముపై పైగా సంస్థలు వారి H.R.లు పాల్గొంటారు. కాబట్టి ఆస‌క్తి కలిగిన, పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్ధులు Xerox కాపీలు మరియు 5 సెట్ల C.V. లతో హాజరు కాగలరని కోరడమైనది. నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా...

రూ. 450 కోట్ల వ్య‌యంతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ది

Image
రూ. 450 కోట్ల వ్య‌యంతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ది హెచ్‌.ఆర్‌.డిలో ప్రారంభ‌మైన స్వ‌చ్ఛ ఐకానిక్ జాతీయ స‌ద‌స్సు    దేశంలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క‌, చారిత్ర‌క‌, ఆధ్యాత్మిక కేంద్రాల‌ను స్వ‌చ్ఛ ఐకానిక్ ప్లేసెస్‌లుగా గుర్తించి వాటిని రూ. 450 కోట్ల వ్య‌యంతో ప‌ర్యాట‌క అనుకూల ప్రాంతాలుగా అభివృద్ది చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ డ్రింకింగ్ వాట‌ర్‌, సానిటేష‌న్ శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ అక్ష‌య్ రౌత్‌ వెల్ల‌డించారు. హైద‌రాబాద్ మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల సంస్థ‌లో స్వ‌చ్ఛ ఐకానిక్ ప్లేసెస్‌ అనే అంశంపై జ‌రిగిన జాతీయ స్థాయి స‌ద‌స్సును జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డితో క‌లిసి అక్ష‌య్ రౌత్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల నుండి వ‌చ్చిన సీనియ‌ర్ అధికారులు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ క్రింద చేప‌ట్టిన ప‌లు కార్పొరేట్ సంస్థ‌ల ప్ర‌తినిధులు హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి, స్వ‌చ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ అక్ష‌య్ రౌత్ మాట్లాడుతూ మొత్తం మూడు ద‌శ‌ల్లో 30 ప్ర‌ముఖ ప‌ర్యాట‌క, చారిత్ర‌క‌, ఆధ్యా...

తండ్రి టి.కృష్ణ భావాల‌ను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ : మంత్రి దేవినేని

Image
తండ్రి టి.కృష్ణ భావాల‌ను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ :మంత్రి దేవినేని   ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'పంతం'. ఎన్నో హిట్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై అభిరుచి గల నిర్మాత కె.కె. రాధామోహన్‌ 'పంతం' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మిస్తున్నారు. హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జూన్‌ 21న జరిగింది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'పంతం' చిత్రం జూలై 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మినిస్ట‌ర్ దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ఎఫ్‌.డి.సి.చైర్మన్‌ అంబికా కృష్ణ, దేవినేని అవినాశ్‌, దేవినేని చందు, ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, గోపీచంద్‌ మలినేని, రత్నకుమార్‌, భాస్కర భట్ల, సంపత్‌ నంది, బాబీ,...

ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు...సై అంటున్న రాజ‌కీయ వార‌సులు

Image
ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు...సై అంటున్న రాజ‌కీయ వార‌సులు పేరుకే రాజులు....రాజ్యాలు క‌నుమ‌రుగైపోయాయి. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అని చెబుతున్నా.... బ‌డా నేత‌ల వంశాలు.. వారి సంతానాలు మాత్ర‌మే ఇప్ప‌టికీ రాజ్యాధికారం చేప‌డుతూ ఉన్నాయి. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనేక మంది బ‌డా నేత‌ల పిల్ల‌లు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌న‌న్నారు. ఎన్నిక‌ల జ‌ర‌గ‌డానికి సంవ‌త్స‌రం ముందు నుంచే రాజ‌కీయ వార‌స‌లు త‌మ స‌త్తాను చాటుకునేందుకు అనేక ర‌కాలుగా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు వారిని ఆక‌ర్షించి ఆక‌ట్టుకునేందుకు అన్ని ర‌కాలుగా దూసుకుపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రాజ‌కీయ వార‌సులు ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు త‌మ అమ్ములో పొదిలో ఉన్న ఆస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటూ ఎన్నిక‌ల వేడిని ర‌గిలిస్తున్నారు.  ష‌రాప‌రంప‌రాలా మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యపదవుల్లో ఉన్న అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇంత ...

నాడొక మురికి కుంట‌...నేడు అది అంద‌మైన ఉద్యాన‌వ‌నం

Image
*నాడొక మురికి కుంట‌...నేడు అది అంద‌మైన ఉద్యాన‌వ‌నం* *రూ. 6.20కోట్ల‌తో కిష‌న్‌బాగ్ పార్కు నిర్మాణం* *ప్రారంభించ‌నున్న మంత్రి కె.టి.ఆర్‌*     నాడు అదో మురికి కుంట‌...నిత్యం దుర్గందం, పిచ్చి మొక్క‌ల‌తో పందులు, ఇత‌ర జంతువుల‌తో ఉన్న ప్రాంతం...నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఈ కిష‌న్‌బాగ్‌ కుంట‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ నేడు అంద‌మైన పార్కుగా రూపొందించింది. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో మ‌రిన్ని పార్కులు ఏర్పాటు చేయ‌డం ద్వారా గ్రీన‌రిని పెంచేందుకు చేప‌ట్టిన ప్ర‌త్యేక చ‌ర్య‌లో భాగంగా ఖాళీగా ఉన్న స్థ‌లాల్లో పార్కుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రాధాన్య‌త‌ను ఇస్తోంది. దీనిలో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండి మురుగునీరు, పిచ్చి చెట్ల‌తో నిండి ఉండి ప‌రిస‌ర ప్రాంతాలు దుర్గందం, దుర్వాస‌న‌, దోమ‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ స‌మ‌స్యకు శాశ్వ‌త ప‌రిష్కారంతో పాటు పాత‌బ‌స్తీ వాసుల‌కు సుంద‌ర‌మైన ఉద్యాన‌వ‌నాన్ని నిర్మించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ఇందుకుగాను రూ. 6.20 కోట్ల‌ను మంజూరు చేసింది. దీంతో రూ. 5.45 కోట్ల‌తో సివిల్ ప‌నులు, రూ. 35 ల‌క్ష‌ల‌తో గ్రీన‌రి, మొక్క‌లు ...

తెలంగాణకు హరితహారం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో ఒకటి

Image
• తెలంగాణకు హరితహారం, జాతీయ రహదారుల భూసేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ డా.ఎస్.కె జోషి వీడియో కాన్ఫరెన్స్. • నాలుగో విడత హరితహారం జులై రెండో వారంలో ప్రారంభానికి సన్నాహాలు  • మెరుగైన ఫలితాల కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సిబ్బందికి రెండు రోజుల చొప్పున శిక్షణ ముందస్తు చర్యలు పకడ్భందీగా ఉండాలి • మొక్కలు, నాటే ప్రాంతాల ఎంపిక, పిట్స్ తవ్వకం పూర్తి చేయాలి తెలంగాణకు హరితహారం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో ఒకటని, ఏమాత్రం పొరపాట్లు జరగకుండా నాలుగో విడత హరితహారం కోసం సన్నద్దం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలకు చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి పిలుపు నిచ్చారు. ఈయేడాది హరితహారంలో 39 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని నిర్ణయించామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపులో కొన్ని జిల్లాలు వెనుకపడ్డాయని తక్షణం ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రాంతాల గుర్తింపు, ముందుస్తుగా పిట్స్ తవ్వకం, రక్షణా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సారి హరితహారంలో స్కూలు పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని, వారినే ప...

*ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా బ‌స్తీ ద‌వాఖానాలు*

Image
*ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా బ‌స్తీ ద‌వాఖానాలు*    నిరుపేద‌ల‌కు అందిస్తున్న వైద్య ప‌రిక్ష‌ల‌కు గాను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన బ‌స్తీ దవాఖానాలు వైద్య స‌హ‌యానికి వ‌చ్చేవారితో కిట‌కిట‌లాడుతున్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఏర్పాటుచేసిన 18 బ‌స్తీ ద‌వాఖానాల్లో ప్ర‌తిరోజు వంద‌లాది మంది వైద్య చికిత్స‌ల‌కై వ‌స్తున్నారు. ప్ర‌ధానంగా బి.జె.ఆర్‌న‌గ‌ర్‌, గుడ్డీబౌలి, హ‌షీమాబాద్ బ‌స్తీ ద‌వాఖానాల‌కు ప్ర‌తిరోజు 200ల‌కు పైగా త‌గు వైద్య ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నారంటే బ‌స్తీ దవాఖానాల ప‌ట్ల బ‌స్తీవాసులు క‌ల్పిస్తున్న ఆద‌ర‌ణ‌కు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ప్ర‌త 5 నుండి 10వేల మంది జ‌నాభాకు ఒక బ‌స్తీ దవాఖానాను ఏర్పాటు చేయాల‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ నిర్ణ‌యించిన సంగ‌తి విదిత‌మే. న్యూఢిల్లీలో విజ‌య‌వంతంగా న‌డుస్తున్న మెహ‌ల్లాక్లీనిక్‌ల ప‌నితీరును కూడా మేయ‌ర్ రామ్మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో అధికారుల బృందం గ‌తంలో ప‌రిశీలించింది. ఢిల్లీలోని మెహ‌ల్లా క్లీనిక్‌ల మాదిరిగానే న‌గ‌రంలో తొలిద‌శ‌లో బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా 2018 ఏప్రిల్ 6వ తేద...

మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ ఇకలేరు

Image
మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ ఇక‌లేరు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నెరేళ్ల వేణు మాధవ్(85) ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని స్వగృహంలో ఈ రోజు కన్నుమూశారు. ఆయన పద్మశ్రీ, శ్రీ రాజ్యాలక్మి ఫౌండేషన్ అవార్డులు పొందారు. మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన తెలంగాణ కీర్తీని ప్రపంచం నలు దిశలు చాటారు. మిమిక్రీ సామ్రాట్ మృతితో ఆయన అభిమాన ఘనం సోకసముద్రం లో నిండిపోయింది.  ఆయ‌న‌ 1932, డిసెంబర్‌ 28న వరంగల్‌లో  జన్మించారు. 1947లో తన 16 ఏటనే మిమిక్రీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దేశవిదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాలంటే ఆసక్తి చూపే వేణుమాధవ్‌. సి.నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వర్రావు, అక్కినేని నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో సన్నిహితంగా ఉండేవారు. భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఎందరో ప్రముఖులు ఆయన ప్రదర్శనలు వీక్షించారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణుమాధవ్‌ దిట్ట. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పు...

జూన్ 21న `పంతం` ఆడియో రిలీజ్ - నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌

Image
జూన్ 21న `పంతం` ఆడియో రిలీజ్ - నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌ టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ 25వ చిత్ర‌మిది.  `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వ‌కుశ‌`వంటి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ప‌నిచేసిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో ఆదివారం ఉద‌యం విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. `పంతం` గురించి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ ``మా సంస్థ‌లో ఏడో చిత్రం. గోపీచంద్‌గారు న‌టిస్తోన్న 25వ సినిమా `పంతం`. చాలా ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించాం. మేకింగ్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. నిర్మాణానంత‌ర ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. జూలై 5న విడుద‌ల చేస్తామ‌ని మేం ఏప్రిల్‌లోనే చెప్పాం. ఆ ప్ర‌కార‌మే ప్ర‌ణాళిక వేసుకుని చిత్రీక‌రిస్తున్నాం. ఇటీవ‌ల యు.కె.,లండ‌న్‌, స్కాట్లండ్ లో కీల‌క స‌న్నివేశాల‌ను, పాట‌ల‌ను చిత్రీక‌రించాం. ఈ నెల 21న విజ‌య‌వాడ‌లో ఆడియో, 24న వైజాగ్‌లో ఫంక్ష‌న్ చేస్తాం. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాం. మంచి ఆర్...

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన ఒక అధ్యయన కమీటీ- మంత్రి కెటి రామారావు

Image
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన  ఒక అధ్యయన కమీటీ - మంత్రి కెటి రామారావు Ø   ఈ కమీటీలో ఇందన, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు మైన్స్, టియస్ యండిసి, సింగరేణి అదికారులు Ø   నెల రోజుల్లో నివేధిక ఇవ్వనున్న కమీటీ Ø   ఇందన శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఉన్నత స్ధాయి ఉమ్మడి సమావేశం Ø   బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్న మంత్రులు Ø   రాష్ర్ట పునర్విభన చట్టంలో పెర్కోన్న మేరకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన భాద్యత కేంద్రం పైన ఉన్నదని, కానీ గత నాలుగు సంవత్సరాలుగా కాలం వెళ్లదీస్తున్నది తప్ప కేంద్రం ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు Ø   బయ్యారం ప్లాంట్ ఏర్పాటు అవసరం అయిన అన్ని విధాలుగా సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉన్నది Ø   ఏవిధంగా చూసిన బయ్యారంలో ప్లాంటు ఏర్పాటుకు అనేక సానూకూలాంశాలున్నాయని, కావాల్సింది కేంద్ర ప్రభుత్వ సానూకూల నిర్ణయమే అన్న మంత్రులు Ø   బయ్యారం ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా, రాకున్నా ప్లాంటు ఏర్పాటుపైన తెలంగాణ ప్రభుత్వం ముందుకే పోతుంది బ...

*మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతంలో పర్యటించిన సీఎంఓ అధికారులు*

Image
* నర్సాపూర్ అడవి పునరుజ్జీవనం కోసం ప్రభుత్వ ముమ్మర ప్రయత్నాలు* * సహజ అడవిని కాపాడుతూ , ఎకో టూరిజం కేంద్రాల అభివృద్దికి చర్యలు*           ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉండి , తర్వాతి కాలంలో వివిధ కారణాల వల్ల క్షీణించిన ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అడవికి పూర్వ వైభవం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ సంపదకు , జంతుజాలానికి పట్టుగొమ్మగా ఉన్న నర్సాపూర్ అడవులను ఖచ్చితంగా పునరుజ్జీవనం చేసుకోవాలని , అందుకోసం తక్షణ చర్యలు తక్షణం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు , ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి , అటవీ సంరక్షణ ప్రధానాధికారి ( Pccf) పీ.కే. ఝా , హరితహారం osd ప్రియాంక వర్గీస్ నర్సాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి , అటవీ శాఖ ఛీప్ కన్జర్వేటర్ ఏ.కె. సిన్హా , జిల్లా అటవీ అధికారి పద్మజా రాణి , ఆర్డీవో వెంకటేశ్వర్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.   ముందుగా అటవీ ప్రాంతంలో విసృతంగా పర్యటించిన ఉన్నతాధికారులు ఆ తర్వాత నర్సా...

ప్ర‌ధానికి 10 అంశాల‌పై విన‌తి పత్రం స‌మ‌ర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

Image
ప్ర‌ధానికి 10 అంశాల‌పై విన‌తి పత్రం స‌మ‌ర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గంటసేపు చర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల, ఐఐఎం మంజూరు, ఐటిఐఆర్ కు నిధులు, కరీంనగర్ లో ఐఐఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తదితర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై ప్రధాన మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.  తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వ...

ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాల ...ఆహ్వానాన్ని అందుకున్న "మా"

Image
ఎస్వీ రంగారావు   శత జయంతి  ఉత్సవాల ...ఆహ్వానాన్ని  అందుకున్న  "మా" అలనాటి విశ్వనాథచక్రవర్తి,  లెజెండ్ స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి శత   జయంతిఉత్సవాన్ని  పురస్కరించుకొని  3  జులై 2018 న ఆయన స్వస్థలం అయిన ఏలూరు లో ఎం ఎల్ ఏ బడేటి కోట రామ రావు(  బుజ్జి) ఎస్వీ రంగారావు కుటుంబీకులు సంయుక్తంగా అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు... ఈ కార్య క్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయిడు గారు ముఖ్య అతిథి గా విచ్చేయనున్నారు... ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఏలూరు ఎం ఎల్ ఏ బడేటి బుజ్జి మరియు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ అంబికా కృష్ణ లు మా అస్సోసియేషన్ సభ్యులను ఆహ్వానించడానికి శనివారం ఉదయం 'మా'కార్యాలయానికి  విచ్చేసారు... ఈ సందర్బంగా ఎస్వీ రంగారావు గారి సత్తా జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను స్వీకరించిన' మా' అసోసియేషన్ సభ్యులు' మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, పరచూరి వెంకటేశ్వర రావు, బెనర్జీ, నాగినీడు, సంతోషం పత్రికా అధినేత, నిర్మాత సురేష్ కొండేటిలు   ఎం  ఎల్ ఏ బడ...

నేనొస్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖాన‌కు అంటున్న ప్ర‌జ‌లు- మంత్రి కెటిఆర్‌

Image
ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు మాన‌వీయ కోణంలో స‌ర్కార్ వైద్య సేవ‌లు వైద్యారోగ్య రంగంలో గుణాత్మ‌క మార్పు 40 శాతం నుంచి 50 శాతానికి పెరిగిన ఓపీ , ఐపీ * నేనొస్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖాన‌కు అంటున్న ప్ర‌జ‌లు- మంత్రి కెటిఆర్‌* అన్ని జిల్లా కేంద్రాల‌కు తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్‌ జిల్లా దవాఖానాల్లో ఎక్కడికక్కడ స్పెషాలిటీ ట్రీట్మెంట్   త్వ‌ర‌లోనే ఇంటింటికీ కంటి వైద్యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వైద్య ప‌రీక్ష‌లు-హెల్త్ ప్రొఫైల్‌ * సిఎం స‌హ‌కారం , దిశానిర్దేశం వ‌ల్లే వైద్యాభివృద్ధి-మంత్రి ల‌క్ష్మారెడ్డి* ఐపిఎంలో *తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్‌* ని ప్రారంభించిన మంత్రులు * హైద‌రాబాద్ ః* తెలంగాణ స‌ర్కార్ మాన‌వీయ కోణంలో వైద్యాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న‌ద‌ని , అందువ‌ల్లే అన్ని స‌దుపాయాల‌తో పాటు ఐపీ , ఓపీ పెరిగి *నేనొస్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖానాకు* అని ప్ర‌జ‌లు అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఐటీ , పుర‌పాల‌క శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు అన్నారు. వైద్యారోగ్య రంగంలో విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌ల కార‌ణంగా గుణాత్మ‌క మార్పు వ‌చ్చింద‌న...