మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ ఇకలేరు
మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ ఇకలేరు
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నెరేళ్ల వేణు మాధవ్(85) ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని స్వగృహంలో ఈ రోజు కన్నుమూశారు. ఆయన పద్మశ్రీ, శ్రీ రాజ్యాలక్మి ఫౌండేషన్ అవార్డులు పొందారు. మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన తెలంగాణ కీర్తీని ప్రపంచం నలు దిశలు చాటారు. మిమిక్రీ సామ్రాట్ మృతితో ఆయన అభిమాన ఘనం సోకసముద్రం లో నిండిపోయింది. ఆయన 1932, డిసెంబర్ 28న వరంగల్‌లో జన్మించారు. 1947లో తన 16 ఏటనే మిమిక్రీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దేశవిదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాలంటే ఆసక్తి చూపే వేణుమాధవ్. సి.నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వర్రావు, అక్కినేని నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో సన్నిహితంగా ఉండేవారు. భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఎందరో ప్రముఖులు ఆయన ప్రదర్శనలు వీక్షించారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణుమాధవ్ దిట్ట. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 1978లో ఆంధ్రా యూనివర్శిటీ ఆయనకు ‘కళాప్రపూర్ణ’ బిరుదు ఇచ్చింది. ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.
Comments
Post a Comment