మాస్టర్ ప్లాన్ బాధితులకు అండగా ఉంటా: బండారు దత్తాత్రేయ

- నూతన్‌కల్ రైతులతో భేటీ.. సమస్యలపై ఆరా   

- ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ



తూఫాన్, మేడ్చల్ (నూతన్‌కల్) :- హెచ్‌ఎండీఏ (HMDA) మాస్టర్ ప్లాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులకు తానున్నానంటూ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ భరోసా ఇచ్చారు. శుక్రవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ మండలం, నూతన్‌కల్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.




భూ వినియోగ జోన్లపై ఆందోళన మాస్టర్ ప్లాన్‌లోని ల్యాండ్ యూజ్ జోన్ల (భూ వినియోగ జోన్లు) కారణంగా తమ భూములకు జరుగుతున్న నష్టంపై రైతులు దత్తాత్రేయకు వివరించారు. భూముల వినియోగంపై ఉన్న ఆంక్షలు, జోన్ల మార్పిడి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా విన్న దత్తాత్రేయ.. మాస్టర్ ప్లాన్ విషయంలో నెలకొన్న గందరగోళంపై ఆందోళన వ్యక్తం చేశారు.


త్వరలోనే సీఎం వద్దకు సమస్యలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న భూ వినియోగ జోన్ల మార్పిడి అంశం రైతులకు భారంగా మారిందని, ఈ విషయంలో తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ సవరణలు, జోన్ల మార్పిడి వల్ల రైతులకు కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం కనుగొంటానని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల భూములకు రక్షణ కల్పించడమే తమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.









Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి