మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం ఎన్ హెచ్ ఆర్ సి సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) వివిధ శాఖల అధికారులతో మంగళవారం నాడు సమావేశమైంది. గౌరవనీయ చైర్‌పర్సన్ శ్రీ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, గౌరవ సభ్యులు శ్రీమతి విజయ భారతి సయానీ, డా.జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, టి ఎస్ హెచ్ ఆర్ సి గౌరవ చైర్మన్ జస్టిస్ శ్రీ షమీమ్ అక్తర్, సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్), శ్రీ ఆర్ . ప్రసాద్ మీనా, రిజిస్ట్రార్ (లా) డిప్యూటీ శ్రీ జోగిందర్ సింగ్ తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలపై నేరాలు అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా డిజిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఉమన్ సేఫ్టీ వింగ్ పనిచేస్తుందన్నారు. వివిధ ప్రాంతాలకు చెందినవారు హైదరాబాద్ లో...