మంత్రిని కలిసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు
మంత్రిని కలిసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు మంగళవారం సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ని కలిశారు.
రాష్ట్రంలో చేపట్టిన NCD (Non Communicable diseases) నివారణ చర్యలపై వారు చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే బీపీ, మధుమేహం వ్యాధుల మీద స్క్రీనింగ్ జరుగుతున్న విషయాన్ని WHO సంస్థ ప్రతినిధులకు మంత్రి వివరించారు. NCD వ్యాధుల అదుపు కోసం తద్వారా ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో పని చెస్టన్నది వివరించారు. రాష్ట్రంలో బీపీ, మధుమేహం వంటి వ్యాధులతో బాధ పడుతున్న వాళ్ళకి దీర్ఘకాలిక మందులు వైద్య పరీక్షల సహాయం అందిస్తున్నామని వారికి మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో మందులను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. క్రమం తప్పకుండా మందులు అందిస్తూ, NCD బ్యాధులు సోకకుండా సోకిన వాళ్లకు సమయానికి మందులు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తున్న NCD స్క్రీనింగ్ పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి ని అభినందించారు WHO ప్రతినిధులు. NCD స్క్రీనింగ్ కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని ఈ సందర్భంగా WHO ప్రతినిధులు మంత్రి తెలిపారు. మంత్రి లక్ష్మారెడ్డి ని కలిసిన వాళ్ళల్లో who ప్రతినిధులు సాధన, icmr ప్రతినిధి డాక్టర్ ప్రభుదీప్ కౌర్ తదితరులు ఉన్నారు.

Comments
Post a Comment