ప్రాంతీయ పత్రికల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమాచార కమిషనర్‌కు వినతి పత్రం
ప్రాంతీయ పత్రికల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమాచార కమిషనర్‌కు వినతి పత్రం
ప్రాంతీయ పత్రికల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిన్న పత్రికలు, మ్యాగజైన్ల ప్రతినిధులు ఐ అండ్ పిఆర్ కమిషనర్‌ను కలిసి వినతీ పత్రం సమర్పించారు. యూసుఫ్ బాబు నేతృత్వంలో ఆయా పత్రికల ఎడిటర్లు శనివారం సమాచార శాఖ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, టి.యు.డబ్ల్యు.జె. హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి సమక్షంలో ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు సమాచార పౌర సంబంధాల శాఖ, కమిషనర్ అరవింద్ కుమార్‌ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను యూసుఫ్ బాబు కమిషనకు విన్నవించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
'చిన్నపత్రికల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారిన జీవో 239ని రద్దు చేయాలని. ఎంప్యానెల్‌మెంట్‌లో ఉన్న పత్రికల వర్గీకరణలో ఏర్పడ్డ సమస్యలు పరిష్కరించాలని. డీ గ్రూప్‌లో ఉన్న పత్రికలకు రేట్ పెంచడంతో పాటు ప్రకటనలను పెంపుదల చేయాలని. ఎంప్యానెల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న దిన ప్రతికలు, మ్యాగజైన్లను తక్షణమే గుర్తించి ఎంప్యానెల్ చేయాలని. ఎంప్యానెల్ అయిన పత్రికలకు క్లాసిఫైడ్ ప్రకటనలు జారీ చేయాలని. ముఖ్యమైన పండుగలు, ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల సందర్భంగా కూడా ప్రకటనలు జారీ చేయాలని. ఎంప్యానెల్‌లో ఉన్న మ్యాగజైన్లకు ప్రతి నెలా ప్రకటనలు విడుదల చేయాలని. గతంలో ప్రచురితమై... వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ప్రతికల ఎడిటర్లకు జిల్లా విలేకరులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని'. కమిషనర్‌కు సమర్పించిన వినతి ప్రత్రంలో ప్రాంతీయ పత్రికల సంపాదకులు పేర్కొన్నారు.


Comments
Post a Comment