పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్ గారు శుక్రవారం రాత్రి జనసేన లోక్ సభ సభ్యులతో సమావేశమయ్యారు.


డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు పకడ్బందీగా సంసిద్ధం కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై, వివరాలు అందించాలన్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతికి సంబంధించిన కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదన్నారు. రాష్ట్రంలో పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, ఈ ఆర్ధిక సంవత్సరం రావాల్సిన నిధులు వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందిస్తారని వాటిని పరిశీలించి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళాలి అన్నారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి