బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ కార్యాలయం ప్రకటన

 బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ కార్యాలయం ప్రకటన 
రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి గెలచి తమ సత్తా చాటాలి 
 -  టి.చిరంజీవులు, ఐఎస్ఐ (రిటైర్డ్) చైర్మన్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం 


కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేసారని టి.చిరంజీవులు, చైర్మన్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆయన విమర్శించారు.


42 శాతం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతనే ఎన్నికలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి, అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆ బిల్లును చట్టంగా రూపొందించడానికి కనీస కార్యాచరణ చేపట్టకుండా, హైకోర్టు మరియు నిధుల విడుదల సాకుగా చూపించి  ఎన్నికలు నిర్వహిస్తామని సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 22 శాతం రిజర్వేషన్ల నైనా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలలో బీసీలకు దక్కవలసిన కనీసం 22% సర్పంచ్ సీట్లు కూడా దక్కకుండా కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్లు అత్యంత తక్కువగా అమలవుతున్నాయని ఆవేద వ్యక్తం చేశారు. 


ఈ నేపథ్యంలో  ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేసి గెలవాలని సూచించారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 


బీసీల జనాభా ప్రతి గ్రామంలో 50% పైనే ఉంటుందని బీసీలకు రాజకీయ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తమ సత్తా చాటుతూ సర్పంచులుగా గెలవాలని,  ప్రభుత్వానకి గుణ పాఠం చెప్పాలని టి.చిరంజీవులు పిలుపు నిచ్చారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి