ఇంటింటి ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి ఉపఎన్నిక ప్రచారం కొనసాగుతోంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత
గోపీనాథ్ కు మద్దతుగా బుధవారం మాజీ డిప్యూటీ స్పీకర్ ఏం. పద్మ దేవేందర్ రెడ్డి,కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల.ఉమా తో కలసి ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ బూత్ నెం 399 లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి.సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపియాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచారంలో స్థానిక నాయకులతోపాటు 399 బూత్ ఇంచార్జ్ లు కొత్త. వెంకటేశం, కుమ్మరి.జగన్,బద్రి మల్లేశం,మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల. ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ వంజరి జయరాజ్,నాయకులు ప్రభు రెడ్డి,జుబెర్, అహ్మద్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment