"Your services in the progress of GHMC are unforgettable: Commissioner R.V. Karnan"
జీహెచ్ఎంసి పురోగతిలో మీ సేవలు మరువలేనివి : కమిషనర్ ఆర్ వి కర్ణన్
పదవి విరమణ పొందిన 19 మంది జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం
హైదరాబాద్, సెప్టెంబర్ 30, (Toofan) జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివనీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. మంగళవారం సాయంత్రం GHMC హెడ్ ఆఫీస్ లో పదవీ విరమణ పొందిన వివిధ స్థాయిలోని 19 మంది అధికారులు, ఉద్యోగులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ శాలువా , పూల దండలతో సత్కరించారు. గిఫ్ట్ లను బహుకరించారు.
ఈ సందర్భంగా కమీషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ... పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. రిటైర్మెంట్ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం లాంటిదని, రిటైర్మెంట్ పొందిన వారు వారి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. వారి మున్ముందు జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరారు. జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, అదనపు కమిషనర్ కే వేణుగోపాల్ ,పిఆర్ఓ మామిండ్ల దశరథం,amc శారద లు పాల్గొన్నారు.
డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన సాత్విక్ నాయక్ కు సత్కారం
జీహెచ్ఎంసీ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన సాత్విక్ నాయక్ కు
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో అదనపు కమిషనర్ కే వేణుగోపాల్ , పిఆర్ఓ మామిండ్ల దశరథం, జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. సాత్విక్ నాయక్ ప్రస్థానం స్పూర్తిదాయకం అని అదనపు కమిషనర్ తెలిపారు.
Comments
Post a Comment