రియల్ ఎస్టేట్... హోటల్ రంగ వ్యాపారిపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేసిన పోలీసులు
రియల్ ఎస్టేట్... హోటల్ రంగ వ్యాపారిపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని ఓ వ్యాపారవేత్తపై ట్రెస్‌పాస్ కేసు నమోదైంది. బాధితుని కథనం ప్రకారం... నగరంలోని బహదూర్‌యార్ జంగ్ కాలనీకి చెందిన సమీర్ అహ్మద్ అన్సారీ వ్యాపారం చేస్తుంటాడు. ఇతను ఫుడ్ జాయింట్ పేరుతో హైదరాబాద్ నగరంలోని కాస్ట్లీ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో వ్యాపారం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబరు 2 లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో మొదటి అంతస్తు తన బిజినెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ స్థలం 5 సంవ్సతరాలకు లీజుకు తీసుకున్న ప్రముఖ రియల్ ఎస్టేట్... హోటల్ రంగ వ్యాపారిపై పి.ప్రమోద్‌కుమార్‌ను(మేనేజింగ్ డైరెక్టర్ @ మున్నా యునైటడ్ - సదరన్ స్సైస్ - రేసర్స్ ఎడ్జ్) కలిశాడు అన్సారీ. అక్కడ ఫుడ్ జాయింట్ నడపడానికి పచ్చజెండా ఊపాడు ప్రమోద్. ఇందుకు గాను అతని వద్ద నుంచి రూ.7 లక్షలు డిపాజిట్‌గా తీసుకున్నాడు. నెల వారి అద్దె కింద రూ.65వేలు చెల్లించాలంటూ సబ్ లీజుకు ఇచ్చాడు. డిపాజిట్ తీసుకోగానే అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో తనకు అద్దెకు ఇస్తున్న ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న ఇతర నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తానని హామీ ఇచ్చాడు ప్రమోద్ కానీ అలా సమయానికి చేయలేకపోయాడు. అంతేకాకుండా అన్సారీతో ఒక కొత్త ప్రతిపాదన చేశాడు. పెండింగ్ నిర్మాణ పనులు స్వంత ఖర్చులతో చేయాలని, వాటిని అద్దెలో మినహాయించుకుందామని చెప్పాడు. చేసేది లేక అతను తన సొంత డబ్బులతోనే పెండింగ్ పనులను మొదలుపెట్టాడు. కొంత కాలం గడిచాక తాను పనిచేయకుండా గొడవ పడడం మొదలుపెట్టాడని అన్సారీ మీడియాతో పేర్కొన్నారు. మరో అడుగు ముందుకు వేసి పనిచేయనీయకుండా బీభత్సం చేస్తూ.... భయానికి గురిచేయడం మొదలుపెట్టాడని బాధితుడు చెప్పుకువచ్చాడు. అప్పటికే రూ.45 లక్షలు ఖర్చు చేసిన అన్సారీ విసిగిపోయాడు. వ్యాపారం కూడా మొదలుపెట్టకుండా ఇన్ని సమస్యల్లో కూరుకుపోయాన్న బాధతో ఏమీ చేయలేకపోయానని బాధితుడు వాపోయాడు. అంతేకాకుండా నిర్మాణానికి సంబంధించి పర్మిషన్లు కూడా లేదని తెలుసుకొని మరింత కుంగి పోయాడు. ఈ నేపథ్యంలో సొంత పని మీద రెండు రోజుల పాటు అన్సారీ బయటకు వెళ్లారు. అదే సమయంలో ప్రమోద్‌కుమార్ మేనేజర్ లక్ష్మీనారాయణ కొంత మంది మనుషులను వెంట పెట్టుకొని తాను లీజ్‌కు తీసుకున్న ప్రాంతానికి వచ్చి నాన గొడవ చేసి నా స్టాఫ్‌ను బెదిరించడంతో వారు అప్పటికప్పుడు డోర్ లాక్ చేసుకొని వెళ్లిపోయారని బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న తాను ఆగస్టు 6వ తేదీన అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌కు వెళ్లగా అప్పటికే డోర్ తాళాలు విరిగి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూడగా ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేసి ఉందని బాధితుడు వివరించారు. ఈ నేపథ్యంలో చేసేది లేక అతను ప్రమోద్‌కుమార్‌పై జుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment