అబిద్స్‌లో యధేచ్ఛగా ప్రముఖ బ్రాండ్ల నకిలీ చేతిగడియారాలు.... పెన్నుల అమ్మకాలు
- నకిలి మకిలి
- అబిద్స్‌లో యధేచ్ఛగా ప్రముఖ బ్రాండ్ల నకిలీ చేతిగడియారాలు.... పెన్నుల అమ్మకాలు
- లక్షల్లో ఖరీదు చేసే ఆ బ్రాండ్ల వస్తువుల వేల రూపాయల్లోనే లభ్యం
- డూప్లికేట్ వాచీలు... పెన్నుల కోసం ఆరాటపడుతున్న సెలబ్రిటీలు
'త్రీ' ఇడియట్స్ సినిమా చూడనివారుండరంటే.... అతిశయోక్తి కాదేమో! హిందీ సినిమాలు చూడని ప్రాంతాల్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేయగా అవి బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యాయి. నకిలీ వాచీలు.... పెన్నుల గురించి చెబుతూ....'త్రీ' ఇడియట్స్ సినిమా సంగతి ఎందుకంటారా?..... ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ సినిమా లో హీరోయిన్ కరీనా కపూర్‌కు ఒక వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. అతను ప్రపంచంలోని నెంబర్ వన్ బ్రాండ్ వస్తువులను మాత్రమే వినియోగిస్తాడు. అతనికి మనుషులపై కన్నా బ్రాండెడ్ వస్తువులపైనే మోజు ఎక్కువ అని నిరూపించే ప్రయత్నం చేస్తాడు హీరో అమీర్ ఖాన్. కరీనాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఒక కాస్టీ చేతి గడియరం కొంటాడు. అది పోయిందని తెలిసే అతను నానా బీభత్సం చేస్తాడు. అ తర్వాత స్టోరీ మీకు తెలిసిందే. సెలబ్రిటీలు.. ఉన్నత వర్గాలకు చెందిన వారు చాలా మంది ఖరీదైనా బ్రాండ్లకు చెందిన వాచీలు.... పెన్నులు కొనడానికి ఆస్తకి కనపరుస్తారు. అయితే నిజమైన బ్రాండ్ల వస్తువుల ఖరీదు లక్షల్లో కొన్నైతే.... మరి కొన్నిటి ధర కోట్లల్లో కూడా పలుకుతాయి. అదే మక్కీకి మక్కీగా ఉండే నకిలీ బ్రాండ్ వాచీలు, పెన్నులు మాత్రం వేల రూపాయల్లోనే దొరికిపోతాయి. చాలా మందికి బ్రాండెడ్ వస్తువుల పట్ల ఉన్న మక్కువను చూసి నకిలీలు మార్కెట్‌లోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలోని అబిద్స్‌లోని వాణిజ్య సముదాయల్లో ని గిఫ్ట్స్ షాపుల్లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మాంట్ బ్లాంక్ అనే ఇంటెర్నేషనల్ బ్రాండ్ పెన్నులు ఇక్కడ నకిలీవి అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయని తెలిసింది. వీటిని కొనేందుకు ఎక్కువగా సెలబ్రిటీలు ఇష్టపడుతుండడంతో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా చేతి వాచీలు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ అమ్మడవుతున్నాయి. రోలెక్స్, రాడో తదితర అంతర్జాతీయ బ్రాండ్ల నకిలి హ్యాండ్ వాచీలు ఇక్కడ తెగ అమ్ముడవుతున్నాయని విశ్వసనీయ సమాచారం. దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో వాచీలు వ్యాపారంలో ఉన్న వారిలో కొందరు నకిలీలను అమ్ముతున్నట్లు సమాచారం. కారియర్స్ ద్వారా వీరు ఈ నకిలీ వాచీలను, పెన్నులను పక్క దేశాలు తెప్పించుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు. నిజమైన బ్రాండ్ రూ.50 వేల నుంచి మొదలవుతుంటే... ఇక్కడ నకిలీవి రూ.5 వేల నుంచే దొరుకుతున్నాయని సమాచారం. అదే విధంగా లక్షల ధర పలికే వాచీలు ఇక్కడ వేలల్లోనే అమ్మేస్తున్నారని భోగట్టా. ఆల్కహాల్ చాక్లెట్ వంటి దందాల గుట్టును విప్పిన పోలీసులు ఇలాంటి నకిలీ బ్రాండ్లు అమ్మేవారిపై కొరడగా జులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Post a Comment