గ్రేటర్‌లో 72 పార్కుల సుందరీకరణ పూర్తి ... మొత్తం లక్ష్యం 100 ఉద్యాన వనాలు
గ్రేటర్‌లో 72 పార్కుల సుందరీకరణ పూర్తి ... మొత్తం లక్ష్యం 100
ఉద్యాన వనాలు
ఉద్యాన వనాలు
గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు మరింత మెరుగైన జీవన విధానం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికిగాను కొత్తగా వంద ఉద్యాన వనాల ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించగా మరో నెలరోజుల్లో వంద పార్కుల నిర్మాణం పూర్తిఅవనున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.40కోట్ల వ్యయంతో 100నూతన పార్కులను వివిధ కాలనీలు, బస్తీల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేసింది. దీనిలో భాగంగా నేటి వరకు 72పార్కులు పూర్తై నగరవాసులకు అందుబాటులోకి రాగా మిగిలిన 28పార్కుల నిర్మాణాన్ని ఏప్రిల్ 30వ తేదీలోగా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి ఆదేశించడంతో నిర్థారిత సమయంలో ఈ పార్కులను పూర్తి చేయడానికి అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ముమ్మరంగా పనులను నిర్వహిస్తోంది. ఈ వంద పార్కుల్లో అధిక శాతం కాలనీలలో నిర్మిస్తుండడంతో పాటు నిర్మాణంలో సంబంధిత కాలనీ సంక్షేమ సంఘాలు వాటి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయి. పూర్తి అయిన పార్కుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టడానికి పార్కులను కాలనీ సంక్షేమ సంఘాలకు అప్పగిస్తున్నారు. పార్కులో నుండి వచ్చే ఆకుపచ్చ, వృక్ష సంబంధిత వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువుల తయారీకిగాను అదే పార్కులో కంపోస్ట్ పిట్‌లను నిర్వహిస్తున్నారు.
*జీహెచ్ఎంసీలో ఉన్న పార్కుల వివరాలు...*
* మేజర్ పార్కులు : 17
* థీమ్ పార్కులు : 17
* బయోడైవర్సిటీ పార్కులు : 10
* కాలనీ పార్కులు : 786
* ట్రాఫిక్ ఐల్యాండ్స్ : 163
* ఫ్లైఓవర్లలో గ్రీనరీలు : 15
* ట్రీ పార్కులు : 428
* సంస్థాగత పార్కులు : 12
* చెరువుల వద్ద పార్కులు : 17
* గ్రేవ్‌యార్డ్ గ్రీనరీలు : 20
* వివిధ ప్రాంతాల్లో సిమెంట్ పాట్స్ ఏర్పాటు : 4,924
* నర్సరీలు : 45
Comments
Post a Comment