హోం గార్డ్స్ కృతజ్ఞత సభ పోస్టర్ విడుదల చేసిన హోం మంత్రి.


హోం గార్డ్స్ కృతజ్ఞత సభ పోస్టర్  విడుదల చేసిన  హోం మంత్రి
తెలంగాణ హోంగార్డ్స్  వేల్ఫేర్ అసోసియోషన్  ఆధ్వర్యంలో ఏప్రిల్ 8 వ తేదిన  హోంగార్డ్స్   కృతజ్ఞత సభ జరగనుంది.  హైదరాబాద్ లోని రవీంద్రభరతిలో  మధ్యహ్నం 2 గంటలకు  కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర హోం  శాఖా మంత్రి  నాయిని నర్సింహరెడ్డి, ఎమ్మేల్యే వి. శ్రీనివాస్ గౌడ్ తదితరులు గురువారం నాడు సచివాలయంలోని  హోం మంత్రి  చాంబర్ లో  సభకు సంబంధించిన  పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ  సందర్భంగా  హోం శాఖా మంత్రి మాట్లాడుతూ  హోం గార్డుల   సేవలను గుర్తించి రాష్ట్ర  ముఖ్యమంత్రి   కె. చంద్రశేఖర్ రావు వారికి  శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని  కృషిచేశారన్నారు. వివాధ  కారణాల వల్ల సాధ్యం కాకపోవడంతో వారి వేతనం  రూ. 20, 200/- లకు పెండంతో పాటు ఇంక్రిమెంటు, అలవెన్సు, డబుల్ బెడ్రూం ఇండ్లు,  కానిస్టేబుళ్ల  ఎంపికలో  రిజర్వేషన్ తదితర సౌకర్యాలను  ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.   అసోసియోషన్  గౌరవ అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హోం గార్డుల అంశంతో పాటు  ఉద్యోగుల విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుక వెళ్లానని, ఆర్డర్ టు సర్వ్, పి.ఆర్.సి. తదితర అంశాలలో ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించారన్నారు.  త్వరలోనే వీటి వివరాలు వెళ్లడిస్తారన్నారు. హోం గార్డుల సంఘం  రాష్ట్ర  అధ్యక్షుడు వి.  రాజేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షడు  ఏడుకొండలు,  సైబరాబాద్  హోం గార్డుల అధ్యక్షుడు అశోక్ కుమార్,  ప్రధాన కార్యదర్శి కుమార స్వామి తదితరులు   కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి