ప్లాస్టిక్ వినియోగ రహిత నగరంగా మార్చడాని గ్రేటర్‌లో హరిత ఉత్సవాలు
ప్లాస్టిక్ వినియోగ రహిత నగరంగా మార్చడాని గ్రేటర్‌లో హరిత ఉత్సవాలు
హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ వినియోగ రహిత నగరంగా మార్చడానికి గ్రేటర్‌లో హరిత ఉత్సవాలను (గ్రీన్ ఫెస్టివల్)ను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ హరిత ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ రెండవ వారం నుండి మంచి ముహుర్తాలు ఉండి పెళ్లిలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందన నగరంలోని అన్ని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, ఇతర డిస్పొజబుల్ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలని ఇప్పటికే జీహెచ్ఎంసి పలు చర్యలను చేపట్టింది. దీనిలో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లను విక్రయించవద్దని కోరుతూ ఇప్పటికే రెండు మూడు సార్లు ప్లాస్టిక్ తయారి దార్లతో నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. ఇప్పటికే దీని ప్రభావంతో నగరంలో 50 మైక్రాన్ల కన్నా తక్కువ కవర్ల వినియోగం గణనీయంగా తగ్గింది. అయితే నగరంలో జరిగే పలు ఫంక్షన్ల సందర్భంగా వేలాది సంఖ్యలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కప్పులు ఉపయోగించేవాటిని వృథాగా వదిలివేస్తుండడం ప్రధాన సమస్యగా పరిగణించింది. ముఖ్యంగా అన్ని ఫక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్‌ను ఉపయోగించడం నివారిస్తే ఇది పర్యావరణాన్ని ఎంతో మేలు చేసేదిగా ఉంటుందని, దీనిలో భాగంగా అన్ని ఫంక్షన్‌హాళ్లలో గాజు గ్లాసులు మీల్స్ ప్లేట్లను ప్రోత్సహించేలా ఆయా ఫంక్షన్‌హాళ్ల నిర్వహకులను చైతన్య పర్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. లక్షలాది రూపాయలతో ఫంక్షన్‌హాళ్లను రెంట్‌కు తీసుకునేవాళ్లు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు కాకుండా గాజు గ్లాసులు, స్టీల్ ప్లేట్లు వాడే విధంగా తప్పనిసరి నిబంధన విధించాలని భావిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. తమ ఫంక్షన్‌హాళ్ల, బాంక్విట్‌హాళ్లలో పూర్తిగా ప్లాస్టిక్ పదర్థాలను నిషేధించి వాటికి ప్రత్యేకంగా పురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చెత్తను, వ్యర్థాలను ఉత్పత్తి చేసే హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లలో తప్పనిసరిగా కంపోస్ట్ పిట్‌లను ఏర్పాటు చేయాలని నిబంధనల విధించినట్టు డా.బి.జనార్థన్‌రెడ్డి గుర్తుచేశారు. హరిత ఉత్సవాలను వచ్చే నెల ద్వితీయవారం నుండి ఉద్యమ రూపంలో ప్రారంభిస్తున్నామని కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి గతంలో ఉన్న ఉద్యానవనాల నగరం పేరును తిరిగి తేవడానికి తెలంగాణకు హరితహారం పథకం కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడేళ్లుగా మూడు కోట్లకు పైగా మొక్కలు నాటగా వీటిలో 80శాతానికి పైగా మొక్కలు సజీవంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత అనువైన, నివాసయోగ్యమైన నగరంగా పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలో ప్రకటించాయిని, ఈ గుర్తింపును కొనసాగించేందుకు హైదరాబాద్ నగరాన్ని మరింత పర్యావరణహితంగా చేయడానికి ఉద్దేశించిన హరిత ఉత్సవాలలో ప్రతి ఇక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వామ్యం కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నగరవాసులకు పిలుపునిచ్చారు.
Comments
Post a Comment