మోజంజాహీ మార్కెట్ పునరుద్దరణ బాధ్యతలు స్వీకరించిన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్
*మోజంజాహీ మార్కెట్ పునరుద్దరణ బాధ్యతలు స్వీకరించిన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్*
సుప్రసిద్ద మోజంజాహీ మార్కెట్‌ను పునరుద్దరించడం ద్వారా దానికిపూర్వవైభవం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ప్రత్యేకచర్యలు చేపట్టారు. మోజంజాహీ మార్కెట్‌ను వెంటనే పునరుద్దరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఇచ్చిన సలహా మేరకు మార్కెట్ పునరుద్దరణకు తాను ప్రత్యేకంగా దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్య కార్యదర్శి నేడు ట్విట్టర్లలో తెలియజేశారు. నిర్వహణలోపం, దుకాణదారులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, హోర్డింగ్‌లు, ఆక్రమణలు తదితర కారణాల వల్ల మోజంజాహీ మార్కెట్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. 1935లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రెండవ కుమారుడైన నవాబ్ మోజంజా బహదూర్ పేరుతో నిర్మించాడు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120షాపులతో నిర్మించిన ఈ మార్కెట్ 1947 వరకు ప్రముఖ పాన్ బజార్‌గా ఉండేదని అప్పటి వారు అంటారు. ఇక్కడ దొరకని పాన్ వెరైటీలు ఉండవు. క్రమక్రమంగా పూలు, మటన్, బేకరీ, ఐస్‌క్రీమ్ షాపులకు ఇది ప్రసిద్దిగా మారింది. పాత బస్తీ, కొత్త బస్తీలకు నాంధిగా దీనిని నిర్మించారు. హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కళాశాల మాదిరిగా మోజంజాహీ మార్కెట్ నిర్మాణ శైలీ ఉంటుందని ఈ మార్కెట్‌కు అనుసంధానంగా ఫ్రూట్ మార్కెట్, ప్లవర్ మార్కెట్ ఉండేది. 1980 అనంతరం ప్రూట్ మార్కెట్ కొత్తపేట్‌కు, 2009లో ప్లవర్ మార్కెట్‌ను గుడి మల్కాపూర్‌కు తరలించారు.
హైదరాబాద్ నగర చారిత్రక వారసత్వ నిర్మాణం కేశాలానికి ప్రతీకగా నిలిచిన మోజంజాహీ మార్కెట్ 87 ఏళ్ల నిర్మాణ అనంతరం పునరువైభవ కలుగనున్నందున చరిత్ర ప్రేమికులు, నగరవాసులు హర్షాదిరేకలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న నాలుగు నెలల్లో మోజంజాహీ మార్కెట్‌ను పూర్తి స్థాయిలో పునరుద్దరిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తన ట్విట్టర్‌లో స్పష్టం చేయడంతో వందలాది మంది లైక్‌ల ద్వారా అభినందిస్తున్నారు.
Comments
Post a Comment