Posts

Showing posts from March, 2018

హోం గార్డ్స్ కృతజ్ఞత సభ పోస్టర్ విడుదల చేసిన హోం మంత్రి.

Image
హోం గార్డ్స్ కృతజ్ఞత సభ పోస్టర్  విడుదల చేసిన  హోం మంత్రి తెలంగాణ హోంగార్డ్స్  వేల్ఫేర్ అసోసియోషన్  ఆధ్వర్యంలో ఏప్రిల్ 8 వ తేదిన  హోంగార్డ్స్   కృతజ్ఞత సభ జరగనుంది.  హైదరాబాద్ లోని రవీంద్రభరతిలో  మధ్యహ్నం 2 గంటలకు  కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర హోం  శాఖా మంత్రి  నాయిని నర్సింహరెడ్డి, ఎమ్మేల్యే వి. శ్రీనివాస్ గౌడ్ తదితరులు గురువారం నాడు సచివాలయంలోని  హోం మంత్రి  చాంబర్ లో  సభకు సంబంధించిన  పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ  సందర్భంగా  హోం శాఖా మంత్రి మాట్లాడుతూ  హోం గార్డుల   సేవలను గుర్తించి రాష్ట్ర  ముఖ్యమంత్రి   కె. చంద్రశేఖర్ రావు వారికి  శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని  కృషిచేశారన్నారు. వివాధ  కారణాల వల్ల సాధ్యం కాకపోవడంతో వారి వేతనం  రూ. 20, 200/- లకు పెండంతో పాటు ఇంక్రిమెంటు, అలవెన్సు, డబుల్ బెడ్రూం ఇండ్లు,  కానిస్టేబుళ్ల  ఎంపికలో  రిజర్వేషన్ తదితర సౌకర్యాలను  ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.   అసోసియోషన్  గౌరవ అధ్య...

మోజంజాహీ మార్కెట్ పున‌రుద్ద‌ర‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌

Image
*మోజంజాహీ మార్కెట్ పున‌రుద్ద‌ర‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌*    సుప్ర‌సిద్ద మోజంజాహీ మార్కెట్‌ను పున‌రుద్ద‌రించ‌డం ద్వారా దానికిపూర్వ‌వైభ‌వం తేవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్‌కుమార్ ప్ర‌త్యేక‌చ‌ర్య‌లు చేప‌ట్టారు. మోజంజాహీ మార్కెట్‌ను వెంట‌నే పున‌రుద్ద‌రించాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఇచ్చిన స‌ల‌హా మేర‌కు మార్కెట్ పున‌రుద్ద‌ర‌ణ‌కు తాను ప్ర‌త్యేకంగా ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు ముఖ్య కార్య‌ద‌ర్శి నేడు ట్విట్ట‌ర్ల‌లో తెలియ‌జేశారు. నిర్వ‌హ‌ణ‌లోపం, దుకాణ‌దారులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, హోర్డింగ్‌లు, ఆక్ర‌మ‌ణ‌లు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మోజంజాహీ మార్కెట్ త‌న పూర్వ వైభవాన్ని కోల్పోయింది. 1935లో చివ‌రి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ త‌న రెండ‌వ కుమారుడైన న‌వాబ్ మోజంజా బ‌హ‌దూర్ పేరుతో నిర్మించాడు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120షాపుల‌తో నిర్మించిన ఈ మార్కెట్ 1947 వ‌ర‌కు ప్ర‌ముఖ పాన్ బ‌జార్‌గా ఉండేదని అప్పటి వారు అంటారు. ఇక్క‌డ దొర‌క‌ని పాన్ వెరైటీలు ఉండ‌వు. క్ర‌మ‌క్ర‌మంగా పూలు, మట...

ప్లాస్టిక్ వినియోగ ర‌హిత న‌గ‌రంగా మార్చ‌డాని గ్రేట‌ర్‌లో హ‌రిత ఉత్స‌వాలు

Image
 ప్లాస్టిక్ వినియోగ ర‌హిత న‌గ‌రంగా మార్చ‌డాని గ్రేట‌ర్‌లో హ‌రిత ఉత్స‌వాలు  హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప్లాస్టిక్ వినియోగ ర‌హిత న‌గ‌రంగా మార్చ‌డానికి గ్రేట‌ర్‌లో హ‌రిత ఉత్స‌వాల‌ను (గ్రీన్ ఫెస్టివ‌ల్‌)ను నిర్వ‌హించాల‌ని జీహెచ్ఎంసీ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసింది. ఈ హ‌రిత ఉత్స‌వాల్లో భాగంగా ఏప్రిల్ రెండ‌వ వారం నుండి మంచి ముహుర్తాలు ఉండి పెళ్లిలు అధికంగా జ‌రిగే అవ‌కాశం ఉన్నంద‌న న‌గ‌రంలోని అన్ని ఫంక్ష‌న్ హాళ్ల‌లో ప్లాస్టిక్ గ్లాసులు, క‌ప్పులు, ఇత‌ర డిస్పొజ‌బుల్ ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను పూర్తిగా నిషేధించాల‌ని ఇప్ప‌టికే జీహెచ్ఎంసి ప‌లు చ‌ర్య‌లను చేప‌ట్టింది. దీనిలో భాగంగా 50 మైక్రాన్ల క‌న్నా త‌క్కువ మందంగ‌ల ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను విక్ర‌యించ‌వ‌ద్ద‌ని కోరుతూ ఇప్ప‌టికే రెండు మూడు సార్లు ప్లాస్టిక్ తయారి దార్ల‌తో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌త్యేక స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. ఇప్ప‌టికే దీని ప్ర‌భావంతో న‌గ‌రంలో 50 మైక్రాన్ల క‌న్నా త‌క్కువ క‌వ‌ర్ల వినియోగం గ‌ణ‌నీయంగా త‌గ్గింది. అయితే న‌గ‌రంలో జ‌రిగే ప‌లు ఫంక్ష‌న్ల సంద‌ర్భంగా వేలాది సంఖ్య‌లో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, క‌ప్పులు ఉప‌యోగ...

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కోచ్ బ్రిజ్ కిశోర్ కు రూ.25ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం

Image
అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కోచ్ బ్రిజ్ కిశోర్ కు రూ.25ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం ఆస్ట్రేలియా లో జరిగిన 2018 ప్రపంచ కప్ పోటీల్లో కాంస్య పతకంతో పాటు జిమ్నాస్టిక్ లో తన సత్తాను చాటుకొని తెలంగాణా కీర్తిని రెప రెప లాడించిన అరుణా రెడ్డి కోచ్ బ్రిజ్ కిశోర్ ను బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్లో మంత్రి పద్మారావు గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది.  ఆయన అందించిన సేవలకు గాను ప్రభుత్వం తరుపున ఆయనకు 25 లక్షల రూపాయల చెక్ ను హాస్పిటల్లో మంత్రి పద్మారావు గారు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్పొర్ట్స్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి గారు, సాట్స్ యం.డి. దినకర్ బాబు మరియు మంత్రి ఓ‌ఎస్‌డి రాజేశ్వర్ రావు గారు తదితరులు పాల్గొనడం జరిగింది.