జీహెచ్ఎంసి పురోగతిలో మీ సేవలు మరువలేనివి : కమిషనర్ ఆర్ వి కర్ణన్ పదవి విరమణ పొందిన 19 మంది జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం హైదరాబాద్, సెప్టెంబర్ 30, (Toofan) జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివనీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. మంగళవారం సాయంత్రం GHMC హెడ్ ఆఫీస్ లో పదవీ విరమణ పొందిన వివిధ స్థాయిలోని 19 మంది అధికారులు, ఉద్యోగులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ శాలువా , పూల దండలతో సత్కరించారు. గిఫ్ట్ లను బహుకరించారు. ఈ సందర్భంగా కమీషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ... పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. రిటైర్మెంట్ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం లాంటిదని, రిటైర్మెంట్ పొందిన వారు వారి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. వారి మున్ముందు జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరారు. జోనల్ క...