జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్‌కు రూ. 8.70కోట్ల చెల్లింపులు

*ఎర్లీబర్డ్‌కు రూ. 8.70కోట్ల చెల్లింపులు* *గత మూడు రోజులుగా రూ. 26.34కోట్లు చెల్లించిన 41,090మంది* ఎర్లీబర్డ్ పథకం కింద ప్రస్తుత 2018-19 సంవత్సర ఆస్తిపన్ను చెల్లింపుదారులతో జీహెచ్ఎంసీకి చెందిన సిటీజన్ సర్వీస్ కేంద్రాలు కిటకిటలాడాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నును చెల్లించేవారికి ఐదు శాతం పన్ను రాయితి ఉంటుందని ప్రకటించిన మొదటి రోజు ఎర్లీబర్డ్ ఆఫర్‌కు విశేష స్పందన లభిస్తోంది. నేడు సోమవారం నాడు 14,641 మంది తమ ఇంటి పన్ను రూ. 8.70కోట్లు చెల్లించారు. వీటిలో 6,367 మంది ఆన్‌లైన్ ద్వారా రూ. 3.75కోట్లు చెల్లించగా సిటీజన్స్ సర్వీస్ సెంటర్ల ద్వారా 7,024మంది రూ. 4.20కోట్లు చెల్లించారు. ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభమైన ఎర్లీబర్డ్ ఆఫర్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 41,090మంది రూ. 26.34కోట్లను జీహెచ్ఎంసీకి చెల్లించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించినట్టైతే పన్ను మొత్తంపై 5శాతం రాయితిని అందిస్తున్నందున ఈ అవకాశాన్ని నగర ప్రజలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని జీహెచ్ఎంసీ క...