Posts

Showing posts from August, 2018

రియ‌ల్ ఎస్టేట్‌... హోట‌ల్ రంగ వ్యాపారిపై ట్రెస్‌పాస్ కేసు న‌మోదు చేసిన పోలీసులు

Image
   రియ‌ల్ ఎస్టేట్‌... హోట‌ల్ రంగ వ్యాపారిపై ట్రెస్‌పాస్ కేసు న‌మోదు చేసిన పోలీసులు హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ వ్యాపార‌వేత్తపై ట్రెస్‌పాస్ కేసు న‌మోదైంది.  బాధితుని క‌థ‌నం ప్ర‌కారం... న‌గ‌రంలోని బ‌హదూర్‌యార్ జంగ్ కాల‌నీకి చెందిన స‌మీర్ అహ్మ‌ద్ అన్సారీ వ్యాపారం చేస్తుంటాడు. ఇత‌ను ఫుడ్ జాయింట్ పేరుతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని కాస్ట్లీ ప్రాంత‌మైన బంజారాహిల్స్‌లో వ్యాపారం నిర్వ‌హించాలని నిర్ణ‌యించుకున్నాడు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబ‌రు 2 లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో మొద‌టి అంత‌స్తు త‌న బిజినెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలుసుకున్నాడు.  ఆ స్థ‌లం 5 సంవ్స‌త‌రాలకు లీజుకు తీసుకున్న ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్‌... హోట‌ల్ రంగ వ్యాపారిపై పి.ప్ర‌మోద్‌కుమార్‌ను(మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ @ మున్నా యునైట‌డ్ - స‌ద‌ర‌న్ స్సైస్‌ - రేస‌ర్స్ ఎడ్జ్‌) క‌లిశాడు అన్సారీ. అక్క‌డ ఫుడ్ జాయింట్ న‌డ‌ప‌డానికి ప‌చ్చ‌జెండా ఊపాడు ప్ర‌మోద్‌. ఇందుకు గాను అత‌ని వ‌ద్ద నుంచి రూ.7 ల‌క్ష‌లు డిపాజిట్‌గా తీసుకున్నాడు. నెల వారి అద్దె కింద రూ.65వేలు చెల్లించాలంటూ స‌బ్ లీజుకు ఇచ్చాడు. డిపాజిట్ తీసుకోగానే...

'పైసా పరమాత్మ' టైటిల్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది

Image
'పైసా పరమాత్మ' టైటిల్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది  - ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి  కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు, కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌ ఆ చిత్రాలకు పట్టం కడతారని 'పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి', రీసెంట్‌గా 'ఆర్‌.ఎక్స్‌ 100' చిత్రాలు ప్రూవ్‌ చేశాయి. ఆ చిత్రాలు సెన్సేషనల్‌ హిట్‌ సాధించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. తాజాగా కంటెంట్‌ బేస్డ్‌తో 'పైసా పరమాత్మ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నూతన నటీ నటులు సంకేత్‌, సుధీర్‌, క ష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష, ప్రధాన పాత్ర దారులుగా లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై విజయ్‌ కిరణ్‌ దర్శకుడిగా విజయ్‌ జగత్‌ నిర్మిస్తోన్న డిఫరెంట్‌ కథా చిత్రం 'పైసా పరమాత్మ'. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని బోనాల పండుగ సందర్బంగా ప్రముఖ నిర్మాత ర...

*స్టాండింగ్ క‌మిటీలో 24 అంశాల‌కు తీర్మానం*

Image
*స్టాండింగ్ క‌మిటీలో 24 అంశాల‌కు తీర్మానం*    జీహెచ్ఎంసీ నూత‌న స‌భ్యుల‌తో స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం నేడు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ స‌మావేశానికి నూత‌నంగా ఎన్నికైన గొల్లూరు అంజ‌య్య‌, తుము శ్ర‌వ‌న్‌కుమార్‌, ముద్ద‌గౌని ల‌క్ష్మిప్ర‌స‌న్న‌, సింగిరెడ్డి స్వ‌ర్ణ‌ల‌త‌, అబ్దుల్ వాహెబ్‌, న‌స్రీన్ సుల్తానా, మ‌హ్మ‌ద్ మాజీద్ హుస్సేన్‌, మ‌హ్మ‌ద్ మొబిన్‌, మ‌హ్మ‌ద్ మూర్తుజా అలీ, మ‌హ్మ‌ద్ ర‌షీద్ ఫ‌రాజుద్దీన్‌, వి.శ్రీ‌నివాస్‌రెడ్డిలు హాజ‌రుకాగా ఎ.కృష్ణ‌, ఎన్‌.శేషుకుమారి, ఎన్‌.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, ఎ.స‌ర‌స్వ‌తిలు గైర్హాజ‌ర‌య్యారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు భార‌తిహోలీకేరి, అద్వైత్‌కుమార్ సింగ్‌, శృతిఓజా, ముషార‌ఫ్ అలీ, దాస‌రి హ‌రిచంద‌న‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, విభాగాధిప‌తులు హాజ‌రైన స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో 24అంశాల‌ను ఆమోదించారు. *స్టాండింగ్ క‌మిటీలో 24 అంశాల‌కు తీర్మానం* * ఎన్నిక‌ల విభాగం జాయింట్ క‌మిష‌న‌ర్‌కు ఎన్నిక‌ల సంబంధిత చెల్లింపులు చేసేందుకు ఆమోదం. * లంగర్‌హౌజ్ బాపూఘాట్ నుండి అత్తాపూర్ మీదుగా వెళ్లే రోడ్డు మార్గంలో న‌లంద‌న‌గ‌ర్ సంక్షేమ సంఘం నుండి స...

*పౌర స‌మ‌స్య‌ల‌పై స‌త్వ‌రం స్పందించాలి - క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి*

Image
Turn off for: Telugu *పౌర స‌మ‌స్య‌ల‌పై స‌త్వ‌రం స్పందించాలి - క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి*     న‌గ‌ర స‌మ‌స్య‌ల‌పై వివిధ సామాజిక మాద్య‌మాలు, ప‌త్రిక‌లు, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను ప్రాధాన్య‌త అంశంగా గుర్తించి వాటిని స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. నిర్వ‌హ‌ణ విభాగం ఇంజ‌నీరింగ్ ప‌నుల‌పై నేడు సూప‌రింటెండెంట్‌, ఎగ్జిక్యూటీవ్ ఇంజ‌నీర్ల‌తో నేడు స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ముషారఫ్ అలీ హాజ‌రైన ఈ స‌మావేశంలో క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ న‌గ‌ర స‌మ‌స్య‌ల‌పై అందే ఫిర్యాదుల ప‌రిష్కారానికి ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా రోడ్ల ప‌రిస్థితులు చేప‌ట్టాల్సిన మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ పై అందే ఫిర్యాదుల‌పై ప్ర‌త్యేకంగా వాట్స‌ప్ గ్రూపులు ఏర్పాటుచేసి వాటిలో పోస్టు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ డెడికేటెడ్ వాట్స‌ప్ గ్రూపుల ద్వారా అందే ఫిర్యాదుల‌పై వెంట‌నే స్పందించాల‌ని ఆదేశించారు. ప్ర‌తి ఇంజ‌నీరింగ్ అధికారి తా...