Posts

Showing posts from July, 2018

యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు క‌నెక్ట్ అయ్యే చిత్రం `చి.ల‌.సౌ` - చైతన్య అక్కినేని

Image
యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు క‌నెక్ట్ అయ్యే చిత్రం `చి.ల‌.సౌ` - చైతన్య అక్కినేని  సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చి||ల||సౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...  చైతన్య అక్కినేని మాట్లాడుతూ - ''7-8 నెలలు క్రితం సమంతో నాతో.. 'రాహుల్‌ నిన్ను, నన్ను కలిసి ఓ స్క్రిప్ట్‌ చెబుతాడట' అంది. నేను రాహుల్‌ నటించబోయే సినిమా అనుకున్నాను. కానీ తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి కాస్త సర్‌ప్రైజ్‌ అయ్యాను. కథ వినగానే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ఇలాంటి కథ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతుందా? అనే సందేహం ఉండేది. సమంత నీది, రాహుల్‌ది సెన్సిబిలిటీస్‌ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చెయ్‌ అంది. సినిమా చూసిన తర్వాత తనతో సినిమా చేయడం సంగతి పక్కన పెడితే.. ఎలాగైనా ఈ సినిమాలో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో చెప్...

అబిద్స్‌లో యధేచ్ఛ‌గా ప్ర‌ముఖ బ్రాండ్ల న‌కిలీ చేతిగ‌డియారాలు.... పెన్నుల అమ్మ‌కాలు

Image
న‌కిలి మ‌కిలి అబిద్స్‌లో యధేచ్ఛ‌గా ప్ర‌ముఖ బ్రాండ్ల న‌కిలీ చేతిగ‌డియారాలు.... పెన్నుల అమ్మ‌కాలు ల‌క్ష‌ల్లో ఖ‌రీదు చేసే ఆ బ్రాండ్ల వ‌స్తువుల వేల రూపాయ‌ల్లోనే ల‌భ్యం డూప్లికేట్ వాచీలు... పెన్నుల కోసం ఆరాట‌ప‌డుతున్న సెల‌బ్రిటీలు 'త్రీ' ఇడియ‌ట్స్ సినిమా చూడ‌నివారుండ‌రంటే.... అతిశ‌యోక్తి కాదేమో! హిందీ సినిమాలు చూడ‌ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేయ‌గా అవి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. న‌కిలీ వాచీలు.... పెన్నుల గురించి చెబుతూ....'త్రీ' ఇడియ‌ట్స్ సినిమా సంగ‌తి ఎందుకంటారా?..... ఇక్క‌డే ఉంది అస‌లు పాయింట్‌. ఈ సినిమా లో హీరోయిన్ క‌రీనా క‌పూర్‌కు ఒక వ్య‌క్తితో పెళ్లి నిశ్చ‌య‌మ‌వుతుంది. అత‌ను ప్ర‌పంచంలోని నెంబ‌ర్ వ‌న్ బ్రాండ్ వ‌స్తువుల‌ను మాత్ర‌మే వినియోగిస్తాడు. అత‌నికి మ‌నుషుల‌పై క‌న్నా బ్రాండెడ్ వ‌స్తువుల‌పైనే మోజు ఎక్కువ అని నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తాడు హీరో అమీర్ ఖాన్‌. క‌రీనాను పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి ఒక కాస్టీ చేతి గ‌డియ‌రం కొంటాడు. అది పోయింద‌ని తెలిసే అత‌ను నానా బీభ‌త్సం చేస్తాడు. అ త‌ర్వాత స్టోరీ మీకు తెలిసిందే. సెల‌బ్రిటీలు.. ఉన్నత‌ వ‌ర్గాల‌క...